చార్‌ధామ్ యాత్ర‌లో అప‌శ్రుతి.. య‌మునోత్రి వ‌ద్ద బ‌స్సు ప్ర‌మాదం

మృతుల కుటుంబాల‌కు రూ. 2ల‌క్ష‌ల ప‌రిహారం

 ఉత్త‌ర కాశీ (CLiC2NEWS): ఉత్త‌రాఖండ్‌లో ఆదివారం సాయంత్రం జ‌రిగిన బ‌స్సుప్ర‌మాదంలో మృతుల సంఖ్య 25కి చేరింది. చార్‌ధామ్ యాత్రికుల‌తో వెళుతున్న బ‌స్సు ఉత్త‌ర కాశీ జిల్లా డామ్టా ప్రాంతంలోని య‌మునోత్రి ఎన్‌హెచ్‌-94 వ‌ద్ద 200 మీట‌ర్ల లోతులోయ‌లోకి ప‌డిపోయింది. ప్ర‌మాద స‌మ‌యంలో డ్రైవ‌ర్‌, ఓ స‌హాయ‌కుడు, 28మంది యాత్రికులున్న‌ట్లు స‌మాచారం. యాత్రికులంతా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ప‌న్నా జిల్లాకు చెందిన‌వారిగా పోలీసులు తెలిపారు. లోయ‌లో ప‌డిన బ‌స్సు రెండు భాగాలుగా విడిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 17 మృత‌దేహాలను బ‌య‌ట‌కు తీశారు. క్ష‌త‌గాత్రుల‌ను డామ్టా, నౌగావ్‌ల‌లోని ప్ర‌భుత్వ ఆరోగ్య కేంద్రాల‌కు త‌ర‌లించారు. మూడు బ‌స్సుల్లో యాత్రికులు చార్‌ధామ్ యాత్ర‌కు బ‌య‌లు దేర‌గా.. ఇందులో ఒక బ‌స్స ప్ర‌మాదానికి గురైంది.

బ‌స్సు ప్ర‌మాదంపై రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ఫ్ర‌దాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ. 2 లోలు.. గాయ‌ప‌డిన వారికి రూ. 50 వేల చొప్పున ప్ర‌ధాన‌మంత్రి జాతీయ స‌హాయ‌నిధి నుండి ప‌రిహారం ప్ర‌క‌టించారు.

య‌మునోత్రి వ‌ద్ద బ‌స్సు ప్ర‌మాదం.. 17 మంది యాత్రికులు మృతి..

 

 

Leave A Reply

Your email address will not be published.