ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌

సికింద్రాబాద్‌ (CLiC2NEWS): ప్ర‌యాణికుల ర‌ద్దీ త‌గ్గించేందుకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే 18 కొత్త స‌ర్వీసులు న‌డ‌ప‌నుంది. చ‌ర్ల‌ప‌ల్లి నుండి దానాపూర్ వ‌యా విజ‌య‌వాడ‌, భువ‌నేశ్వ‌ర్ , పాట్నా రూట్‌లో ఈ ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డ‌ప‌నున్నారు. ఈ మేర‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సిపిఆర్ఒ శ్రీ‌ధ‌ర్ వెల్ల‌డించారు. చ‌ర్ల‌ప‌ల్లి – దానాపుర్ వైపు వెళ్లే ఈ ప్ర‌త్యేక రైలు ఫిబ్ర‌వ‌రి 20 నుండి 28 వ‌ర‌కు 9 ప్ర‌త్యేక స‌ర్వీసులు.. దానాపుర్‌-చ‌ర్ల‌ప‌ల్లి రూట్‌లో మ‌రో 9 ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిపిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌యాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగ‌ల‌ర‌ని కోర‌డ‌మైన‌ది.

 

Leave A Reply

Your email address will not be published.