బాలివుడ్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం ‘ఛావా’

Chhaava: విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన హిస్టారికల్ ఫిల్మ్ ఛావా. ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. శంభాజి మహారాజ్ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రీ సేల్ బుకింగ్స్‌లోనే 5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. తొలిరోజు రూ.31 కోట్లు వసూలు చేసి.. బాలీవుడ్‌లో ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం గా రికార్డు సృష్టించింది. ఇటీవల విడుదలైన అక్షయ్‌కుమార్ స్కై ఫోర్స్ చిత్రం తొలి రోజు రూ.15.30 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఛావా చిత్రం మొదటి స్థానంలో నిలిచింది.
ఈ చిత్రంపై విక్కీ కౌశల్ భార్య కత్రినా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విక్కీ నటన చూసి తాను ఆశ్చర్యపోయానని, శంభాజి మహారాజ్ పాత్రకు జీవం పోశావన్నారు. కౌశల్ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలుస్తుందిని .. చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉందన్నారు. సినిమాలో అందరూ వారి వారి పాత్రలకు వంద శాతం న్యాయం చేశారని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.