మార్చి 7నుండి తెలుగులో ‘ఛావా’ రిలీజ్: గీతా ఆర్ట్స్

హైదరాబాద్ (CLiC2NEWS): విక్కీకౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఛావా.. మార్చి 7 నుండి తెలుగు వెర్షన్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు గీతా ఆర్ట్స్ పోస్ట్ పెట్టింది. ఛత్రపతి వివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ఛావా. శంభాజి మహారాజ్, ఆయన భార్య యేసుబాయిగా విక్కీ కౌశల్, రష్మిక నటించిన చిత్రం ఈనెల 14వ తేదీని విడుదలై భాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కు చిత్ర బృందం సిద్ధమైంది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై మార్చి 7 నుండి ఛావా తెలుగు వెర్షన్ అందుబాటులోకి రానుంది.లక్ష్మణ్ ఉటేకర్ దర్వకత్వంలో శంభాజీ మహారాజ్ కథతో రూపుదిద్దుకున్న ఛావా చిత్రంలో .. అక్షయ్ ఖన్నా ఔరంగజేబు ప్రాత్ర పోషించారు.