మకరాసనంతో నడుము నొప్పికి చెక్!
మకరాసనం సర్వైకల్, నడుము నొప్పి, స్లిప్ డిస్క్ నివారణలకు చక్కని యోగాసనాలు
సర్వైకల్..
అస్తవ్యస్తమైన దినచర్య నియమబద్ధతలేని కారణంగా సుమారు ప్రతి మూడో వ్యక్తికి ఈ సమస్య సర్వైకల్ ఉంటుంది.
స్లిప్ డిస్క్
సమస్య వల్ల డిస్క్ తన సాధారణ పరిమితులకు మించి పెరుగుతుంది దీన్ని వాపు అని కూడా అనుకోవచ్చు. ఆ డిస్క్ బయట గోడ చాలా అరిగిపోతుంది దీనితో రోగి సహించలేనంత నొప్పి కలుగుతుంది.
నడుము నొప్పి
ఈ సమస్య వాత దోష కారణంగా వస్తుంది ఆహారపు అలవాట్లు జీవనశెలిలో మార్పు తెచ్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చును
ఈ పైన ఉన్నటువంటి స్లిప్ డిస్క్ కానీ నడుము నొప్పిగాని సర్వైకల్ గాని చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ వస్తుంది. వాతం వల్ల గాని వృద్ధాప్యం వల్ల గాని కంప్యూటర్ ఎక్కువగా ఆపరేటింగ్ చేయడం వల్ల గాని ఈ రోగాలు వస్తున్నాయి.
ఈ క్రింది ఆసనం వేస్తే చక్కగా నడుము నొప్పి తగ్గుతుంది.
మకరాసనం…
చేయు విధానము
వెల్లకిలా పడుకొని మోకాళ్ళని మడవాలి రెండు చేతులు మోచేతులు కలిపి స్టాండ్ లా చేసి అరచేతుల్ని గడ్డం కింద తీసుకొని రావాలి చాతికి పైకి లేపాలి. కాళ్ళని కలిపి ఉంచాలి వెనక ఇప్పుడు శ్వాస తీసుకుంటూ కాళ్ళని ముందు ఒక్కొక్కటిగా ముడుస్తూ తర్వాత రెండిటిని ఒకేసారి మడవాలి ముడుస్తున్న సమయంలో కాళ్లు మడుమలు పిరుదలకు తగలాలి. శ్వాస బయటికి వదులుతూ కాళ్ళని తిన్నగా ఉంచాలి. ఈ అభ్యాసాన్ని 20 నుంచి 25 సార్లు చేయాలి.
దీనివల్ల ప్రయోజనాలు స్లిప్ డిస్క్ సర్వైకల్ సయాటిక సమస్యలు తగ్గుతాయి ఆస్తమా ఊపిరితిత్తు సమస్యలు తగ్గుతాయి మోకాళ్ళ నొప్పులతో ఉన్నవారికి భాధ నుంచి ఈ ఆసనం ద్వారా ప్రయోజనకరంగా ఉంటుంది
కటి ఉత్తానాసన్.
చేయు విధానము.
శవాసనం లోకి పడుకొని రెండు కాళ్ళని మడిచి ఉంచాలి. మోకాళ్ళని మడవాలి. రెండు చేతులు మోచేతుల్ని కలిపి స్టాండ్ లా చేసి అరచేతుల్ని గడ్డం కింద తీసుకొని రావాలి. పిరుదలు భుజాలు నేలకు ఆనుకొని ఉండాలి. శ్వాసను వదులుతూ కిందకి నేలకి అదిమిపట్టి తిన్నగా ఉంచాలి. ఈ అభ్యాసాన్ని ఎనిమిది నుంచి 15 సార్లు చేయాలి.
దీనివలన ప్రయోజనాలు స్లిప్ డిస్క్ సయాటికా నడుము నొప్పులు తగ్గుతాయి.
-షేక్. బహార్ అలీ
యోగాచార్యుడు, ఆయుర్వేద వైద్యుడు