కెమికల్ ఫ్యాక్టరి అగ్నిప్రమాదం: రూ.25 లక్షలు పరిహారం ప్రకటించిన సిఎం జగన్

అమరావతి (CLiC2NEWS): ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, పాక్షికంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పాన పరిహారం ప్రకటించారు. ప్రమాదంపై పూర్తి దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందించాలని అధికారులను సిఎం ఆదేశించారు.