చేనేత మిత్ర: ఈ నెల నుండి ప్రతి మగ్గానికి రూ. 3వేలు
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/KTR-IN-MANNEGUDA.jpg)
మన్నెగూడ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో నేతన్నల కోసం చేనేత మిత్ర అనే పథకాన్ని ఈ నెల నుండే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ పథకం కింద ప్రతి మగ్గానికి నెలకు రూ. 3వేలు ఇవ్వనున్నారు. సోమవారం మన్నెగూడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొట్ట మొదటి సారిగా చేనేత మీద 5% జిఎస్‌టి వేసిన ప్రధాని నరేంద్రమోడి అని అన్నారు. కేంద్రం తీరుపై మంత్రి ధ్వజమెత్తారు. చిన్నపుడు సిఎం కెసిఆర్ చేనేత కార్మికుల ఇండ్లలో ఉండి చదువుకున్నారని గుర్తుచేసుకున్నారు. చేనేత కార్మికుల గురించి ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నారు. నేతన్నలకు చేయూత అందించాలని ఈ పథకం తీసుకొచ్చారన్నారు.