Chennai: గుండెపోటుతో కార్డియాక్ స‌ర్జ‌న్ మృతి

చెన్నై (CLiC2NEWS): త‌మిళ‌నాడుకు చెందిన యువ కార్డియాక్ స‌ర్జ‌న్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. చిన్న వ‌య‌సులోనే యువత గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవ‌డం ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. చెన్నైలోని ప్రైవేటు ఆస్ప‌త్రిలో కార్డియాక్ స‌ర్జ‌న్‌గా ప‌నిచేస్తున్న డా.గ్రాడ్లిన్ రాయ్..  బుధ‌వారం ఆస్ప‌త్రి వార్డుల్లో రౌండ్స్‌లో ఉండ‌గా ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయారు. అత‌నిని కాపాడేందుకు స‌హోద్యోగులు శ్ర‌మించినా ఫ‌లితం ద‌క్క‌లేదు. గుండెకు సంబంధించిన అన్ని విష‌యాల‌లో అవ‌గాహ‌న క‌లిగి ఉన్న కార్డియాల‌జి డాక్ట‌ర్ గుండెపోటుతో మృతి చెంద‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఒత్తిడి, దీర్ఘ‌కాలిక ప‌ని గంట‌లే కార‌ణ‌మ‌ని నిపుణులు తెలుపుతున్నారు.

 

Also Read:  మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దు

2 Comments
  1. […] Chennai: గుండెపోటుతో కార్డియాక్ స‌ర్జ‌న్ … […]

  2. […] Chennai: గుండెపోటుతో కార్డియాక్ స‌ర్జ‌న్ … […]

Leave A Reply

Your email address will not be published.