కాంగ్రెస్ గూటికి చేవెళ్ల ఎమ్మెల్యే

బిఆర్ఎస్‌కు మ‌రో షాక్‌..

ఢిల్లీ (CLiC2NEWS): భార‌త రాష్ట్ర స‌మితి (బిఆర్ఎస్‌)కు మ‌రో షాక్ త‌గిలింది. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాద‌య్య కాంగ్రెస్ లో చేరారు. ఇటీవ‌ల తెలంగాణ మాజి స్పీక‌ర్ , బాఆర్ ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి, జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విష‌యం తెలిసిందే. ఢిల్లీలో సిఎం రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాలె యాద‌య్య‌ కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురు బిఆర్ ఎస్ ఎమ్మెల్య‌లే హ‌స్తం గూటికి చేరారు.

Leave A Reply

Your email address will not be published.