Chhattisgarh: నలుగురు మావోయిస్టులు మృతి
రాయ్‌పుర్ (CLiC2NEWS): మావోయిస్టులకు, పోలీస్‌ఫోర్స్‌కు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధలో మంగళవారం సెంట్రల్ రిజర్వ్ పోలీసులు, డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ దళాలు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కాల్పులు జరిగిన ప్రదేశంలో మృతదేహాలతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.