కేజ్రీవాల్‌తో సిఎం కెసిఆర్ భేటీ..

ఢిల్లీ (CLiC2NEWS): ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కెసిఆర్ సమావేశమయ్యారు. కేజ్రీవాల్‌తో కలిసి కెసిఆర్ ఢిల్లీలోని మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. పాఠశాల సిబ్బంది, పాఠశాల ప్రత్యేకతలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, సదుపాయాలను కెసిఆర్‌కు వివరించారు. పాఠశాల వసతులకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. అనంతరం మొహల్లా క్లినిక్‌లను కెసిఆర్ పరిశీలించనున్నట్లు సమాచారం.
కాగా సిఎం కెసిఆర్ ఈ మధ్యాహ్నం ఎస్పి అధినేత అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కెసిఆర్ నివాసంలో సమావేశమయ్యారు. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులు గురించి చర్చించినట్లు తెలుస్తోంది.