ఆళ్లగడ్డ పట్టణంలో విషాదం.. స్కూల్ బస్సు చక్రాల కింద పడి చిన్నారి మృతి
ఆళ్లగడ్డ (CLiC2NEWS): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు చక్రాల కింద పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. స్థానిక ఎంవి నగర్‌కు చెందిన శ్రీధర్ , వనజ దంపతులకు కుమార్తె హరిప్రియ (5).. ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్‌కెజి చదువుతోంది. పాఠశాలలు పునఃప్రారంభం అయిన తర్వాత ఈ రోజే స్కూల్ కి వెళ్లింది. సాయంత్రం స్కూల్ నుండి తిరిగి వస్తూ పాఠశాల బస్సు దిగి, బస్సు ముందువైపు నుండి నడుచుకుంటూ వెళుతుంది. గమనించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో చిన్నారి బస్సు ముందు చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది.