పదో తరగతి విద్యార్థులకు 20వేల సైకిళ్లు పంపిణీ: బండి సంజయ్
కరీంనగర్ (CLiC2NEWS): కేంద్ర మంత్రి బండి సంజయ్ పదో తరగతి విద్యార్థులకు 20వేల సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆయన పుట్టినరోజు (జులై 11)కు ముందే జులై 8 లేదా 9 తేదీల్లో వీటి పంపిణీ ప్రారంభించనున్నట్లు సమాచారం. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పదో తరగతి విద్యార్థులకు ప్రధాని మోడీ కానుకగా సైకిళ్లను ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎక్స్ వేదికగా తెలిపారు. ఒక్కో సైకిల్ ధరల 4 వేలని.. ప్రతి సైకిల్‌పై ప్రధాని మోడీ ఫొటో ఉంటుందని పేర్కొన్నారు.
కరీంనగర్‌లో 3,096 మంది విద్యార్థులకు, రాజన్న సిరిసిల్లలో 3,841 మంది , జగిత్యాలలో 1,137, సిద్దిపేట లో 783, హనుమకొండలో 491 మంది చొప్పున మొత్తం 9,348 మంది విద్యార్ధులకు సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు అదనంగా కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజిన్‌లలో 50 చొప్పున, అన్ని మండలాల్లో 100 చొప్పున పంపిణీ చేయనున్నారు. ఇంకా హుజురాబాద్, హుస్నాబాద్ , సిరిసిల్ల, వేముల వాడ, చొప్పదండి, జమ్మికుంట, కొత్తపల్లి మున్సిపాల్లిలలో వార్డుకు 50 చొప్పున సైకిళ్లను పంపిణీ చేయనున్నట్ఉల బండి సంజయ్ తెలిపారు. ఆయన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని గ్రామ పంచాయతీల్లో 10 నుండి 25 సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.