ఎనుమాముల మర్కెట్ వద్ద మిర్చి రైతుల ఆందోళన
వరంగల్ (CLiC2NEWS): వరంగల్ జిల్లాలో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని ఎనుమాముల మర్కెట్ వద్ద మిర్చి రైతులు ధర్నాకు దిగారు. మిర్చి కొనుగోళ్లలో వ్యాపారులు మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనలు నిర్వహించారు. మిర్చికి మద్దతు ధర చెల్లించకుండా వ్యాపారులు కుమ్మక్కై, తక్కువ ధర నిర్ణయించారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని వ్యవసాయ మార్కెట్ గేటు ముందు బైఠాయించి రైతులు నిరసన తెలిపారు.