China: అతి భారీవర్షం.. తేలియాడిన కార్లు..
మెనస్ ప్రావిన్స్‌లో 1000 ఏళ్లలో భారీ వర్షం.. 12 మంది మృతి
బీజింగ్ (CLiC2NEWS): చైనాలోని హెనస్ ప్రావిన్స్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంతగా కుంభవృష్టి వర్షాలు భీకర వరదలు సంభవించాయి. ఈ భారీ వర్షాలకు 12 మంది మరణించారు. సుమారు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మీడియా తెలిపింది. రాష్ట్ర వరద నియంత్రణ, నిర్వహణ బ్యూరోకి చెందిన బృందం లెవల్ 3 హెనాన్‌లో సహాయక చర్యలను ప్రారంభించింది. సుమారు 849 మందిని రక్షించామని, 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్‌హౌ నగరంలో 1975లో 198.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని, మంగళవారం గరిష్టంగా 201.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని జాతీయ వాతావరణ అబ్జర్వేటరీ తెలిపింది.
శనివారం నుండి మంగళవారం వరకు ఈ నగరం 617.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని.. టైఫూన్‌తో భారీ వర్షం కురిసినట్లు నిపుణులు తెలిపారు.
జెంగ్‌హౌలో రెడ్ అలెర్ట్ జారీ చేశామని, స్థానిక నదులు, జలాశయాలపై నిఘా పెంచినట్లు అధికారులు తెలిపారు. అన్ని సబ్ వేస్టేషన్‌లను వరదలు ముంచెత్తాయని, దీంతో సబ్‌వేలను మూసివేసినట్లు తెలిపింది.
వరుసగా రెండు రోజులు భారీ వర్షాలు కురవడంతో .. 16 జలాశయాల్లోని నీటి మట్టాలు హెచ్చరికస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని మీడియా తెలిపింది. రాబోయే 24 గంటల్లో హెనాన్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
వరదల కారణంగా ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. జెంగ్జౌలో లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీగా వరదలు సంభిస్తుండటంతో బస్సు, రైలు సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. 250 కి పైగా విమానాల రాకపోకలను రద్దు చేశారు. ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించేందుకు ప్రాముఖ్యత నివ్వాలని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ జింగ్‌హౌ వరద నివారణ, విపత్తు సహాయక బృందం అధికారులకు ఆదేశించారు.