అన్నయ్యకు నేను తమ్ముణ్ని కావడం నా పూర్వజన్మ సుకృతం.. పవన్ ఎమోషనల్ ట్వీట్..
మెగాస్టార్ చిరంజీవి సోమవారంతో 67వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. అటు సినీ ప్రముఖులు, ఇటు రాజకీయ నాయకుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి అభిమానులైతే మెగస్టార్ పోస్టర్లకు పాలాభిషేకాలు చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చిరంజీవికి ట్విట్లర్‌లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
“అన్నయ్య.. తెలుగు భాషలో నాకు ఇష్టమైన పదం.. నేను ఆరాధించే చిరంజీవిగారిని అలా పిలవడమే అందుకు కారణమేమో.. అలాంటి అన్నయ్యకు జన్మదినం సందర్భంగా మనసావాచా కర్మణా అనురాగపూర్వక శుభకాంక్షలు. ఈ ప్రత్యేకమైన రోజున మీకు మంచి ఆరోగ్యం, విజయం, కీర్తి దక్కాలని కోరుకుంటున్నాను“ అంటూ పవన్ ట్విట్టర్‌లో పుట్టిన రోజు శుకాంక్షలు తెలిపారు.
My Wholehearted Birthday wishes to my Beloved Brother whom I love ,respect & adore.. @KChiruTweets
Wishing you Good Health,Success & Glory on this special day.— Pawan Kalyan (@PawanKalyan) August 22, 2022