ఇండస్ట్రీలో పెద్దరికం అనుభవించాలనే ఉద్దేశం నాకు లేదు: చిరంజీవి
![](https://clic2news.com/wp-content/uploads/2021/08/chiru-2-750x430.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): చిత్రపురి కాలనీలో నూతనంగా నిర్మించిన గృహసముదాయాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. సినీ పరిశ్రమలోని కార్మికుల కోసం చిత్రపురికాలనీలో నూతన గృహాలను నిర్మించారు. చిరంజీవి గురువారం లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 22 ఏళ్ల క్రితం ఇదే రోజున చిత్రపురి కాలనీకి శంకుస్థాపన చేశారని తెలిపారు. తనకు ఈ విషయం ఛైర్మన్ అనిల్ దొరై చెప్పగానే.. షూటింగ్లో బిజి కారణంగా ఈ కార్యక్రమానికి రాలేనని చెబుదాముకున్న నేను .. తానుకూడా ఈ కార్యక్రమంలో భాగం కావాలని నిర్ణయించుకున్నానన్నారు. ప్రోగ్రామ్స్ అన్ని కాన్సిల్స్ చేసుకుని ఇక్కడికి వచ్చానన్నారు.
ఛైర్మన్ అనిల్ దొరై సారథ్యంలో అన్ని పనులు సక్కమంగా జరిగాయని.. కల్యాణ్, తమ్మారెడ్డి తెలిపారన్నారు. నూతన గృహ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు ఎవరికి ఏ అవసరమొచ్చినా నేను ముందుంటానన్నారు. నినీ కార్మికులు, కళాకారులు నాకు కుటుంబంతో సమానమని.. వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతానన్నారు. పెద్దరికం అనుభవిచాలనే కోరిక లేదని.. అవసరమైనపుడు అందరికీ తప్పకుండా అండగా ఉంటానని చిరంజీవి తెలిపారు.