ఎపి సిఎం జగన్తో ముగిసిన చిరంజీవి భేటీ

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో చిరంజీవి సమావేశం అయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి ఎపి సిఎంతో సమావేశం మయ్యేందుకు వచ్చారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ ఎదర్కుంటున్న సమస్యలను జగన్కు చిరంజీవి వివరించారు. సినిమా టికెట్ ధరలను పెంచాలని, పరిశ్రమకు ప్రవ్యేక ప్రోత్సాహాకాలు ఇవ్వాలని కోరారు. కరోనా కారణంగా ఎంతో మంది సినీ కార్మికులు కష్టాల్లో ఉన్నారని, వారికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.