అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు 157 షురూ..

హైదరాబాద్ (CLiC2NEWS): అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రాబోతుందన్న విషయం తెలిసిందే. చిరు 157వ సినిమాకు ఆదివారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో అనిల్ రావిపూడి మంచి విజయాన్ని అందుకున్నారు. తనదైన మార్క్ కామెడీ, యాక్షన్ తో అనిల్ , మెగస్టార్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి చిరంజీవి కుమార్తె సుస్మిత, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి .. తన అసలు పేరుతో (శంకర్ వరప్రసాద్ పాత్రలో) నటించనున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించనున్నట్లు సమాచారం.
ఉగాది సందర్బంగా కొత్త సినిమా ముహుర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హీరో వెంకటేష్, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్ రాజు, నాగ వంశీ , దర్శకులు రాఘవేంద్ర రావు, వశిష్ట, వంశీ పైడిపల్లి , శివ నిర్వాణ, బాబి, శ్రీకాంత్ ఓదెల, రచయిత విజయేంద్ర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.