శివ‌న్న‌కు ఇండ‌స్ట్రీలో 40 ఏళ్లు .. అభినంద‌న‌లు తెలిపిన చిరు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): క‌న్న‌డ అగ్ర‌హీరో శివ‌రాజ్‌కుమార్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 40 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా టాలీవుడ్‌, కోలీవుడ్ అగ్ర‌న‌టులు అభినంద‌నలు తెలియ‌జేశారు. మెగాస్టార్‌, క‌మ‌ల్‌హాస‌న్, నాగార్జున‌తో పాటు ప‌లువురు శివ‌న్న‌కు అభినంద‌న‌లు తెలిపారు. క‌న్న‌డ కంఠీర‌వుడు రాజ్‌కుమార్ పెద్ద కుమారుడు
శివ‌రాజ్ కుమార్ హీరో , నిర్మాత , టివి వ్యాఖ్యాత‌గా సుప‌రిచిత‌మే. క‌న్న‌డ సినీ రంగంలో శివ‌న్న‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. క‌ర్ణాట‌క రాష్ట్ర ప్ర‌భుత్వ సినిమా పుర‌స్కారం, ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌, సైమా అవార్డ్స్ తో పాటు అనేక అవార్డులు అందుకున్నారు. ప్ర‌స్తుతం తెలుగులో రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘పెద్ది’లో శివ‌రాజ్ కుమార్ కీల‌క పాత్ర లో క‌నిపించ‌నున్నారు.

శివ‌రాజ్ కుమార్ తండ్రి రాజ్‌కుమార్ నాకు తండ్రితో స‌మానం. ఆయ‌న నాపై ఎంతో ప్రేమ చేపేవార‌ని .. తండ్రి అడుగుజాడల్లో న‌డుస్తూనే త‌న ప్ర‌తిభ‌తో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడ‌న్నారు. ఆయ‌న ఇండ‌స్ట్రీలో వ‌చ్చి 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారంటే న‌మ్మ‌లేక‌పోతున్నాన‌ని.. మ‌రిన్ని విజ‌యాలు సొంతం చేసుకోవాల‌ని కోరుకుంటున్న‌ట్లు చిరు తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.