గుడివాడలో మెగాస్టార్ అభిమానులు నిరసన..
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/FANS-OF-CHIRANJEEVI-IN-GUDIWADA.jpg)
గుడివాడ (CLiC2NEWS): ప్రముఖ నటుడు చిరంజీవిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు చిరు అభిమానులు ఆందోళన చేపట్టారు. వాల్తేరు వీరయ్య 200 రోజుల సెలబ్రేషన్స్‌లో మాట్లాడిన చిరంజీవి వ్యాఖ్యలపై పలువురు ఎపి మంత్రలు తమతమ శైలిలో కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు చిరు అభిమానులు నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పలంటూ డిమాండ్ చేశారు.
వాల్తేరు వీరయ్య సక్సెస్ సెలబ్రేషన్స్‌లో చిరు మాట్లాడిన మాటలకు రాజకీయ దుమారం రేకిత్తించాయి. చిరంజీవి రాజకీయాంశాలపై మాట్లాడుతూ.. పెద్దలపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందిస్తూ.. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పకోడీగాళ్లు ఉన్నారు. వాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. నటులు సినిమాలు , డ్యాన్సులు చేసుకోవాలని సలహా ఇస్తే బాగుండు..మాకు సలహాలిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో గుడివాడలోని చిరు అభిమానులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు.