భాగ్యనగరంలో చిరుజల్లులు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాజధాని భాగ్యనరగంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని కోఠీ, నాంపల్లి, సుల్తాన్ బజార్, కింగ్ కోఠి, బషీర్ బాగ్, లిబర్జీ, నారయణగూడలో మోస్తరు వర్షం కురుస్తోంది. అలాగే సికింద్రాబాద్, పద్మారావు నగర్, మారేడ్‌పల్లి, బేగంపేటలో చిరుజల్లులు కురుస్తున్నాయి.
కాగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భాగ్యనగరానికి ఉత్తర, పడమర వైపు నల్లటి దట్టమైన మేఘాలు కమ్ముకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నగరవాసులు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలలో నీటి నిల్వలు ఉండకుండా చూడాలని కింది స్థాయి సిబ్బందికి అదికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే అత్యవర పరిస్థితుల్లోనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.