జ‌ల‌మండ‌లిలో ఘ‌నంగా క్రిస్మ‌స్ వేడుక‌లు

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని జ‌ల‌మండ‌లి కార్యాల‌యంలో క్రిస్మ‌స్ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఖైర‌తాబాద్ ప్ర‌ధాన కార్యాల‌యంలో నిర్వ‌హించిన ఈ వేడుక‌లకు ఎండి దాన‌కిశోర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆయ‌న జ‌ల‌మండ‌లి ఉగ్యోగులు, సిబ్బందికి క్రిస్మ‌స్ శుభాకంక్ష‌లు తెలిపారు. ప్ర‌పంచ‌మంత‌టా ఉన్న క్రైస్త‌వుల‌కు ఇది సంతోషక‌ర‌మైన‌ స‌మ‌య‌మ‌న్నారు. అందరినీ గౌరవించడం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనే రెండు ముఖ్య‌మైన విషయాలు యేసుక్రీస్తు చెప్పారన్నారు. జీవితంలో మ‌నం చేసిన మంచి ప‌నులే నిలిచిపోతాయ‌ని చెప్పారు. బోర్డులో మ‌తాల‌కు అతీతంగా అన్ని పండ‌గ‌లూ జ‌రుపుకుంటామ‌న్నారు. అనంత‌రం కేకు క‌ట్ చేశారు. పాస్ట‌ర్‌ పీట‌ర్ సామ్యూల్ త‌న ప్ర‌సంగాన్ని వినిపించారు. క్వ‌య‌ర్ టీమ్ పాట‌లు, క్ష‌మాగుణంపై వేసిన నాటిక ఆక‌ట్టుకున్నాయి.
ఈ కార్య‌క్ర‌మంలో ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, రెవెన్యూ డెరెక్టర్ వి.ఎల్. ప్రవీణ్ కుమార్, ఫైనాన్స్ డైరెక్టర్ వాసుదేవ నాయుడు, సీజీఎంలు విజయరావు, దశరథ్ రెడ్డి, వినోద్ భార్గవ, అమరేందర్ రెడ్డి, సుదర్శన్, పద్మజతో పాటు నిరుప‌మ‌, వ‌సంత‌, దిపాళి తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.