30 ఏళ్లలో మూడు రెట్లు పెరిగిన లోనాక్ సరస్సు..!
వరద ఉధ్ధృతికి కొట్టుకుపోయిన చుంగుతాంగ్ డ్యామ్..

సిక్కిం (CLiC2NEWS): ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో వరద మొత్తం చుంగుతాంగ్ డ్యామ్ వైపు మళ్లడంతో డ్యామ్ కొట్టుకుపోయింది. నాసిరకమైన నిర్మాణం కారణంగా డ్యామ్ కొట్టుకుపోయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ వెల్లడించారు. గత 30 ఏళ్లలో లోనాక్ సరస్సు సైజు మూడు రెట్లు పెరిగినట్లు.. ఇది ఎపుడో వరదలకు కారణమవుతుందని 2021లో బెంగళూరు ఐఐఎంకు చెందిన ఓ రీసెర్చర్ హెచ్చరించినట్లు సమాచారం.
లోనాక్ సరస్సు నుంచి పూర్తి నీరు చుంగుతాంగ్ డ్యామ్ వైపు మళ్లింది. వరద ఉధ్ధృతికి డామ్ కొట్టుకుపోవడంతో దిగువ ప్రాంతాపైకి వరద పోటెత్తింది. దీంతో రాష్ట్రం ఉత్తర భాగంతో మిగిలిన ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. మొత్తం నీరు లీకై ఉంటే ఊహించనంత ప్రాణనష్టం జరిగేదని నిపుణులు తెలుపుతున్నారు.