రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా చిక్కిన సిఐ, ఎస్ఐ

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని కుషాయిగూడకు పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ , ఎస్ ఐ లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. శుక్రవారం పిఎస్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించగా.. వీరస్వామి, షఫి రూ. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. భూవివాదం పరిష్కారం కోసం మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుని అతని ద్వారా లంచం డిమాండ్ చేసినట్టు ఎసిబి గుర్తించింది. మధ్యవర్తి ఉపేందర్ లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.