లంచం తీసుకుంటూ పట్టుపడిన సిఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు
![](https://clic2news.com/wp-content/uploads/2024/05/ACB.jpg)
మక్తల్ (CLiC2NEWS): పోలీసు అధికారులు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు. నారాయణ పేట జిల్లా మక్తల్‌లో సిఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఓ కేసులో రూ. 20వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. మక్తల్ సిఐ చంద్ర శేఖర్, కానిస్టేబుళ్లు శివారెడ్డి, నరసింహ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు.
మరోచోట ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లు సైతం లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డారు. భద్రాద్రి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అటవీ భూమి నుండి మట్టి తవ్వుకునేందుకు ఓ రైతు వద్ద నుండి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న ఎసిబి అధికారులు ఇల్లెందు మండలం పరిధిలో కొమరామం ఫారెస్టు రేంజ్ ఆఫీసులో దాడులు నిర్వహించి సిబ్బందిని పట్టుకున్నారు.