రెండు వారాల్లో పార్టీ కార్యాలయం నుండే ప్రకటన ..సినీ నటుడు అలీ

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని సినీ నటుడు అలీ కుటుంబ సమేతంగా ఇవాళ సిఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. అనంతరం అలీ మాట్లడుతూ.. త్వరలో గుడ్‌న్యూస్ ఉంటుందని, పార్టీ కార్యాలయం నుండి ప్రకటన వెలువడుతుందని పేర్కొన్నారు. వైఎస్ ఆర్ సిఎం కాకముందు నుండే వారి కుటుంబంతో పరిచయం ఉందని, 2004లో ఆయన పాదయాత్ర చేసిన తర్వాత కలశానని తెలిపారు.గత సాధారణ ఎన్నికలు సందర్భంగా ఎమ్మెల్యే టికెట్ ఆఫర్‌చేశారన్నారు. సమయం లేక వద్ధన్నాని చెప్పారు. సిఎం కార్యాలయంనుండి పిలుపు రాగా ఇవాళ రావడం జరిగిందని అలీ అన్నారు. ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చానన్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నాననిఅన్నారు.