సినీన‌టుడు శ‌ర‌త్‌బాబు క‌న్నుమూత‌..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): సీనియ‌ర్ న‌ట‌డు శ‌ర‌త్‌బాబు హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. శ‌రీరంలోని అవ‌యువాలు దెబ్బ‌తిని ఆయ‌న మృతి చెందిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. శ‌ర‌త్‌బాబు మృతితో సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. అభిమానుల సంద‌ర్శ‌నార్థం శ‌ర‌త్‌బాబు భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబ‌ర్‌కు త‌ర‌లించారు. అక్క‌డినుండి చెన్నైకు త‌ర‌లించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.