మ‌ణిర‌త్నం, శంక‌ర్ మ‌హాదేవ‌న్‌ల‌కు భార‌త్ అస్మిత పురాస్కారం

పుణెకు చెందిన ఎమ్ ఐటి  వ‌ర‌ల్డ్  పీస్ యూనివ‌ర్సిటి గ‌త 18 సంవ‌త్ప‌రాలుగా వివిధ రంగాల‌కు చెందిన నిష్ణాతుల‌ను భార‌త్ అస్మిత రాష్ట్రీయ అవార్డుల‌తో స‌త్క‌రిస్తోంది. చిత్ర రంగానికి చెందిన ప్ర‌ముక ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం, బాలీవుడ్ ప్ర‌ముఖ గాయ‌కుడు శంక‌ర్ మ‌హాదేవ‌న్‌ లు ఈ అవార్డుకు ఎంపిక‌య్యారు. గురువారం వ‌ర్చువ‌ల్ వేదిక‌గా జ‌ర‌గ‌బోయే 18వ భార‌త్ అస్మిత అవార్డు ప్ర‌ధానోత్సవంలో వీరు పుర‌స్కారాల‌ను అందుకోనున్నారు.

ఈ అవార్డుల ప్ర‌ధోనోత్స‌ వం  భార‌త్ అస్మిత్‌ ఫౌండేష‌న్‌తో పాటు ఎమ్ ఐటి స్కూల్ ఆఫ్ గ‌వ‌ర్న్‌మెంట్ నిర్వాహ‌కులు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టివ‌రకు మ‌ణిర‌త్నం ఆరు జాతీయ పుర‌స్కారాలు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డుల‌తో పాటు ‘ప‌ద్మ‌శ్రీ; కూడా అందుకున్నారు. శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ కేవ‌లం గాయ‌కుడుగానే కాకుండా సంగీత ద‌ర్శ‌కుడుగా కూడా గుర్తింపు పొందారు. ఆయ‌న మూడు జాతీయ పుర‌స్కారాల‌తో పాటు భార‌త ప్ర‌భుత్వం నుండి ‘ ప‌ద్మ‌శ్రీ’ కూడా అందుకున్నారు,.

Leave A Reply

Your email address will not be published.