‘సర్కారువారి పాట’ నుండి ‘కళావతి..’ పాట విడుదల..

హైదరాబాద్ (CLiC2NEWS): పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారువారి పాట’ చిత్రం నుండి ‘కళావతి..’ మ్యూజిక్ వీడియేను చిత్ర బృందం విడుదల చేసింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈసినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేయాల్సి ఉండగా.. ఆన్లైన్లో లీకైన సంగతి తెలిసిందే. దీంతో ఈ పాటను షెడ్యూల్‌కు ముందే విడుదల చేశారు. ‘కమా కమాన్ కళావతి .. నువ్వే లేకుంటే అదోగతి’ అంటూ సాగే ఈ మెలోడి పాట ఆకట్టుకుంటుంది. అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యంకు తమన్ సంగీత దర్శకుడు. సిధ్ శ్రీరామ్ ఆలపించారు. ఈచిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు.