Cinema: యూటూబ్ ఛాన‌ళ్ల‌కు విష్ణు హెచ్చ‌రిక‌

విమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం ప్ర‌త్యేకంగా విమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ గ్రీవెన్స్ సెల్ (WEGC) ఏర్పాటు చేస్తున్నామ‌ని మా మూవి ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు విష్ణు తెలిపారు. మ‌హిళల సాధికార‌త కోసం ఈ ‌క‌మిటీ ప‌నిచేస్తుంద‌ని పేర్కొన్నారు. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌న్మాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. నటీమణులు, హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపెక్షించేది లేదని హెచ్చిరించారు. క‌థానాయిక‌ల‌కు త‌గిన గౌర‌వం ఇవ్వాలి, కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు నటుల పట్ల దారుణంగా ప్రవరిస్తున్నాయని, అసభ్యకర రీతిలో వారిపై రూమర్లు క్రియేట్‌ చేస్తు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయన్నారు. అలాంటి ఛానళ్లపై చర్యలు తప్పవన్నారు. మన ఆడపడుచులను గౌరవించాలని విష్ణు విజ్ఞప్తి చేశారు. ప‌రిధి దాటే యూటూబ్ ఛాన‌ళ్ల‌ని నియంత్రించేందుకు ప్ర‌త్యేక సెల్ ఏర్పాటు చేస్తున్న‌ట్టు విష్ణు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.