ఓయులో సివిల్స్ కోచింగ్..
హైదరాబాద్ (CLiC2NEWS): ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్స్‌కు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఉచింతంగా శిక్షణ అందించనున్నారు. ఈ ఏడాదినుండే సివిల్స్ అభ్యర్థులకు కోచింగ్ అందించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా డైరెక్టర్‌గా ప్రొఫెసర్ సి గణేశ్, కొ ఆర్డనేటర్‌గా డాక్టర్ ఇ సుజాతను నియమించారు. సివిల్స్‌తోపాటు, ఆర్ ఆర్ బి, ఎస్ ఎస్ సి, బ్యాంకు సర్వీసులు, గ్రూప్-1, గ్రూప్-2 వంటి పోటీ పరీక్షలకు కూడా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. వీటిలో కోచింగ్ ఇచ్చేందుకు అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులయిన వారికి ఉచితంగా తరగతులు నిర్వహిస్తురు. 600 మంది విద్యార్థులకు ఒకేసారి తరగతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.