సుప్రీంకోర్టు ప్రాంగణంలో ప్రత్యేక ‘కెఫే’ ప్రారంభించిన సిజఐ
ఢిల్లీ (CLiC2NEWS): దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రాంగణంలో దివ్యాంగులతో నడిచేఏ కెఫేను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ప్రారంభించారు. మానసిక, శారీరక వైకల్యంలో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించే ఉద్దేశంతో సిజెఐ ఇతర న్యాయమూర్తులతో కలిపి శుక్రవారం ప్రత్యేక కేఫ్‌టేరియాన ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్ మాట్లాడుతూ.. ఈ కెఫేను నడిపేవారంతా ప్రత్యేక అవసారలున్నావారేరన్నారు. మిట్టి కెఫే దేశవ్యాప్తంగా 38 కేఫ్‌టేరియాలను నిర్వహిస్తోందని.. కరోనా సమయంలో కూడా 60 లక్షల భోజనాలను వీరు అందించారన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కెఫె ప్రారంభించడం ఆనందంగా ఉందని సిజెఐ అన్నారు. దివ్యంగ న్యాయవాదులు, వ్యాజ్యదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేలా దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సిజెఐ ఇప్పటికే పలుమార్లు పిలుపునిచ్చారు.