రాష్ట్రపతి ప్రత్యేక ఆహ్వనం.. మొఘల్ గార్డెన్ సందర్శించిన ప్రధాన న్యాయమూర్తి
ఢిల్లి (CLiC2NEWS): రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆహ్వానం మేరకు సిజెఐ ఎన్.వి. రమణ దంపతులు రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్‌ను సందర్శించారు. రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్‌లో ప్రతి సంవత్సరం ‘ఉద్యానోత్సవ్’ నిర్వహిస్తారు. ఈ ‘ఉద్యానోత్సవ్’ను ఫిబ్రవరి 10వ తేదీన రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ప్రారంభించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస ఎన్.వి. రమణ తో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులతో కలిసి మొఘల్ గార్డెన్స్‌ను సందర్శించారు. రాష్ట్రపతి వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిజెఐ జస్టిస్ ఎన్.వి.రమణ సుప్రీంకోర్టు వార్షిక నివేదికను రాష్ట్రపతికి అందజేశారు.
రాష్ట్రపతి భవన్‌లో మొఘల్ గార్డెన్స్‌ను ఫిబ్రవరి 12వ తేది నుండి మార్చి 16వ తేదీ వరకు సందర్శకులను అనుమతి చేస్తున్నారు. కొవిడ్ నిబంధనల మేరకు ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్నవారికి మాత్రం ఈ గార్డెన్‌ను సందర్శించే వీలు ఉంటుందని రాష్ట్రపతి భవన్ ప్రకటనలో తెలిపింది.