Olympics: ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌

భారత బృందం ఫ్లాగ్‌ బేరర్‌గా భజరంగ్‌ పూనియా

టోక్యో (CLiC2NEWS): ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ సజావుగా సాగిన టోక్యో ఒలింపిక్స్ ఘ‌నంగా ముగిశాయి. 19 రోజులపాటు మొత్తం ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ ఆట‌ల పండుగ‌.. ఆదివారం క్లోజింగ్ సెర్మ‌నీతో సాయొనారా (గుడ్‌బై) చెప్పింది. కోవిడ్‌ నిబంధనలు కారణంగా ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలను గతంలో మాదిరిగా అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగా నిర్వహించారు. ముగింపు సంద‌ర్భంగా మ‌రోసారి అన్ని దేశాల‌కు చెందిన అథ్లెట్లు త‌మ జాతీయ ప‌తాకాల‌తో స్టేడియంలోకి వ‌చ్చారు. ఇండియా త‌ర‌ఫున బ్రాంజ్ మెడ‌ల్ విన్న‌ర్, రెజ్ల‌ర్ భ‌జ‌రంగ్ పూనియా త్రివ‌ర్ణ ప‌తాకంతో సంద‌డి చేశాడు.

మూడేళ్ల త‌ర్వాత 2024లో ఈ గేమ్స్‌ను నిర్వ‌హించ‌డానికి ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ సిద్ధ‌మ‌వుతోంది. ప్యారిస్‌ వేదికగా జరగబోయే తదుపరి(2024) ఒలింపిక్స్‌ గురించి పది నిమిషాల వీడియోను ప్రదర్శించనున్నారు. చివర్లో ఒలింపిక్స్‌ టార్చ్‌ను పారిస్‌ ఒలింపిక్స్‌ నిర్వాహకులకు అందించడంతో ఈ ముగింపు వేడుకలు ముగిస్తాయి.

ఈ ఒలింపిక్స్‌లో మొత్తం 85 దేశాలు పతకాల ఖాతా తెరవగా.. భారత్‌ ఏడు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు) సాధించడం ద్వారా పతకాల పట్టికలో 47వ స్థానంలో నిలిచింది. ఇక పతకాల వేటలో టాప్‌ 3 స్థానాల కోసం ఎప్పటిలాగే అమెరికా, చైనా, జపాన్‌లు పోటీ పడ్డాయి.

పతకాల వారిగా..

  • అమెరికా 113 పతకాలు
    (39 స్వర్ణం, 41 రజతం, 33 కాంస్యం)
  • చైనా 88 పతకాలు
    (38 స్వర్ణం, 32 రజతం, 18 కాంస్యం)
  • జపాన్‌ 58 పతకాలు
    (27 స్వర్ణం, 14 రజతం, 17 కాంస్యం)

1 Comment
  1. SEO says

    Wow, superb blog layout! How long have you ever been running a blog for? you make running a blog look easy. The overall glance of your website is wonderful, let alone the content material!!

Leave A Reply

Your email address will not be published.