ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో సిఎం, డిప్యూటి సిఎం భేటీ
![](https://clic2news.com/wp-content/uploads/2025/02/cm-revanth-reddy-met-with-kc-venu-gopal.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డి ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణు గోపాల్‌తో భేటీ అయ్యారు. సిఎంతో పాటు డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ , కాంగ్రెస్ పార్టి తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి, ఎంపిలు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలో కులగణన, ఎస్ సి వర్గీకరణ గురించి చర్చించేందుకు ఎఐసిసి కార్యదర్శితో సమావేశమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పిసిసి కూర్పు వంటి విషయాల గురించి కూడా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.