సోనూసూద్‌ను అభినందించిన సిఎం చంద్రబాబు
నాలుగు అంబులెన్స్‌లు అందించిన 'సూద్ ఛారిటి ఫౌండేషన్'
అమరావతి (CLiC2NEWS): ఎపి ప్రభుత్వానికి ‘సూద్ ఛారిటి ఫౌండేషన్’ నాలుగు అంబులెన్స్‌లను అందించింది. ఈ సందర్బంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. నటుడు సోనూసూద్ సిఎం చంద్రబాబును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వానకి అప్పగించిన నాలుగు అంబులెన్స్‌లను సిఎం ప్రారంభించారు. సోనూసూద్‌ను ఈ సందర్భంగా సిఎం అభినందించారు. ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, దీనిలో సూద్ ఛారిటి ఫౌండేషన్ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.