ప్రధాని మోడీతో సిఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీ (CLiC2NEWS): ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోడీ తో సిఎం సమావేశమయ్యారు. అమరావతి, పోలవరం, నిధులు, రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వేజోన్ శంకుస్థాపన, సెయిల్‌లో విశాఖ స్టీల్ విలీనం, వరబాధితులను ఆదుకొనేందుకు కేంద్రం నుండి సాయం తదితర అంశాలను ప్రధానితో చర్చించినట్లు సమాచారం. అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సిఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రేపు కంద్ర మంత్రి గడ్కరీ, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురీతో సమావేశం కానున్నట్లు సమాచారం.