రతన్‌టాటా భౌతికకాయానికి సిఎం చంద్రబాబు నివాళి

ముంబయి (CLiC2NEWS): దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌టాటా భౌతికకాయానిక ఎపి సిఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నివాళి అర్పించారు. ముంబయిలోని ఎన్‌సిపిఎ గ్రౌండ్‌లోని పార్ధివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. రతన్‌టాటా లాంటి మహోన్నతమైన వ్యక్తి లోకాన్ని వీడిపోవడం తీరని లోటని సిఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
దిగ్గజ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్‌టాటా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అధికారిక లాంఛనాలతో మహారాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. అంత్యక్రియలకు కేంద్రప్రభుత్వం తరపున హోమ్‌మంత్రి అమిత్‌షా హాజరయ్యారు.