హార్డ్ వర్క్వద్దు.. స్మార్ట్ వర్క్ చేయండి :సిఎం చంద్రబాబు
అమరావతి (CLiC2NEWS): గతంలో ఉద్యోగులు ఎక్కువ గంటలు కార్యాలయాల్లో పనిచేసేవారని, ప్రస్తుత ఆధనిక సాంకేతిక అప్డేట్ అవుతోన్న కారణంగా ఆ అవసరం లేదని సిఎం చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ దినోత్సవ సభలో ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులతో మాట్లాడుతూ.. సాయంత్రం 6 గంటల తర్వాత ఉద్యోగులెవరూ ఆఫీస్‌ల్లో ఉండొద్దనేది ఈ ప్రభుత్వ విధానం అన్నారు. హార్డ్ వర్క్ చేయెద్దు.. స్మార్ట్ వర్క్ చేయాలని ఆయన ఉద్యోగులకు సూచించారు. సచివాలయ ఉద్యోగులు సహా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎక్కువ పని గంటలు కష్ట పడాల్సిన పనిలేదన్నారు. స్మార్ట్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు.