ప్రజాప్రతినిధులు నెలలో నాలుగు రోజులు గ్రామాల్లో ఉండాలి: సిఎం చంద్రబాబు

అమరావతి (CLiC2NEWS): నెలలో నాలుగు రోజుల పాటు ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో ఉండాలని.. మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె నిద్ర చేయాలని సిఎం చంద్రాబాబు దిశానిర్దేశం చేశారు. గురువారం ఎపి మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో నాలుగో వంతు కూడా పొరుగురాష్ట్రాల్లో అమలు కావడం లేదని.. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సిఎం సూచించారు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌పై సిఎం మంత్రులతో చర్చించారు. ముందుగా మంత్రులంతా ప్యాలెస్‌ని సందర్శించి.. అనంతరం ఏంచేయాలనే దానిపై అభిప్రాయాలు వ్యక్త పరచాలని సిఎం సూచించారు.
ప్రవీణ్ మృతి కేసులో ఒక్కో సిసి కెమెరాలో ఒకే విషయం బయట పడుతుందన్నారు. ఈ కేసు ఛేదనలో కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అప్రమత్తంగా లేకుంటే బాబాయ్ గొడ్డలి, కోడికత్తి తరహాలో అన్నీ మనపైనే వేస్తారన్నారు. అన్నింటికి అప్రమత్తంగా ఉంటూ కుట్రలను తిప్పికొట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు.