మహిళా సాధికారత మాటల్లో చెప్పేది కాదు.. చేతల్లో చూపించాలి. సిఎం చంద్రబాబు

అమరావతి (CLiC2NEWS): మహిళలకు ఆస్తిలో హక్కును తొలిసారి ఎన్‌టిఆర్ కల్పించారని సిఎం చంద్రబాబు అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ..తెలుగు దేశం పార్టి.. తెలుగించి ఆడపడుచుల పార్టి అని సిఎం అన్నారు. తమ ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలో పెట్టుకునే చేశామన్నారు. తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా గత సిఎం ఉన్నారని.. ఇచ్చిన ఆస్తిని సైతం వెనక్కి తీసుకోవాడానికి కోర్టుకుకూడా వెళ్లారన్నారు. మా ప్రభుత్వ హయాంలో తొలిసారి విద్యా, ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించామన్నారు. దీంతో వారు బాగా చదువుకున్నారు. ఆడ బిడ్డ పుడితే రూ.5వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశామని .. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 రిజర్వేషన్లు కల్పించాం. డీలిమిటేషన్ పూర్తయితే సుమారు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని సిఎం తెలిపారు.