జూన్‌లోగా డిఎస్‌సి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాం.. సిఎం

అమరావతి (CLiC2NEWS): కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల్లో 12.9 % వృద్ది సాధించామని.. సంపద ఎలా సృష్టించాలి అనేదానిపై నిత్యం ఆలోచిస్తున్నామని సిఎం చంద్రబాబు తెలిపారు. చిత్తూరు జిల్లా గంగాధర పర్యటనలో భాగంగా నిర్వహించిన సభలో సిఎం మాట్లాడారు. గత ఐదేళ్ల పాటు జనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. జూన్‌లోగా డిఎస్‌సి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని ఈ సందర్భంగా సిఎం తెలిపారు.