సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు వినియోగించాలి: సిఎం చంద్రబాబు
శ్రీశైలం (CLiC2NEWS): సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు వినియోగించుకోవాలని.. దీంతో రెండు రాష్ట్రాల రైతాంగానికి మేలు జరుగుతుందని ఎపి సిఎం చంద్రాబాబు అన్నారు. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన సిఎం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు తన జీవితంలో చాలా సంతోషకరమైన రోజు అని.. జులై తొలివారంలోనే శ్రీశైలం జలాశయం నిండటం శుభపరిణామన్నారు. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని.. 200 టిఎంసిల నీరు శ్రీశైలం జలాశయంలో ఉందన్నారు. జలాలే మన సంపద అని.. శ్రీశైల మల్లన్న ఆశీస్సులతో రాయలసీమ సుభిక్షంగా ఉంటుందిన సిఎం అన్నారు.
రాయలసీమ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చంద్రబాబు అన్నారు. సాగు నీటి ప్రాజెక్టులకు రూ.68వేల కోట్లు కర్చు చేశామని.. జీడిపల్లికి నీరు తీసుకెళ్లే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఈ నెల 15 కల్లా ఆ ప్రాంతానికి నీరు రావాలని.. అలాగే, 30 కల్లా కుప్పం, మదనపల్లెకు నీళ్లు తెస్తామన్నారు. రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే పోలవరం వలనేనన్న సిఎం.. సీమకు ఎమేం చేయాలో తన వద్ద బ్లూ ప్రింట్ ఉందని తెలపారు.