వైఎస్ఆర్ (కడప) జిల్లాలో స్టీల్ ప్లాంట్‌కు సిఎం జగన్ భూమి పూజ
కడప (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ ఆర్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిందాల్ స్టీల్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ఎప్పటినుండో కలలుకంటున్న స్వప్నం ఈ ఉక్కుపరిశ్రమ అని .. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని వైఎస్ ఆర్ కలలుగన్నారని అన్నారు. అనంతరం సిఎం ఉక్కు పరిశ్రమ నమూనాను పరిశీలించారు. వాటికి సంబంధించిన వివరాలను
సిఎంకు జిందాల్ వివరించారు.
స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధిలోకి వస్తుందని.. దీనికోసం ఎంతో కష్టపడాల్సివచ్చిందన్నారు. రూ.8,800 కోట్లతో 3 మిలయన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. తొలివిడతలో రూ. 3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పతి అవుతుందని సిఎం వివరించారు.