AP: ఆక్సిజ‌న్ ప్లాంట్‌లను ప్రారంభించిన‌ సిఎం జ‌గ‌న్

విజ‌య‌వాడ‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సిఎం క్యాంపు కార్యాల‌యంనుండి రాష్ట్రంలోని 144 ఆక్సిజ‌న్ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సిఎం మాట్లాడుతూ.. ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను జాతికి అంకితం చేస్తున్నామ‌ని తెలిపారు. 100 ప‌డ‌క‌లు ఉన్న‌ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌పై 30% స‌బ్సిడీ అందిస్తున్నామ‌ని తెలియ‌జేశారు. ప్ర‌తిప్ర‌భుత్వాస్ప‌త్రుల‌లో ఆక్సిజ‌న్ సౌల‌భ్యం అందిస్తున్నామ‌ని, ఒక్కో ప్లాంట్‌లో నిమిషానికి వెయ్యి లీట‌ర్ల ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి అవుతుంద‌ని సిఎం తెలిపారు. కొవిడ్ సెకండ్ వేవ్‌లో ఆక్సిజ‌న్ విమానాల్లో తెచ్చుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని ఆయ‌న గుర్తుచేశారు. ఇప్పుడు మ‌న‌మే సొంతంగా ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేసేలా చ‌ర్యలు చేప‌ట్టామ‌ని ఆయ‌న అన్నారు. విజ‌య‌వాడ‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశామ‌ని వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.