ప్రధాని మోడి, అమిత్‌షాకు ఎపి సిఎం జగన్ లేఖ

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దేశ ప్రధానమంత్రికి, కేంద్ర హోంమంత్రికి లేఖలు రాశారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టం జరింగిందని తక్షణమే ఆదుకోవాలని కేంద్రాన్ని సిఎం జగన్ కోరారు. రాష్ట్రానికి రూ. 1000 కోట్లు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎపిలో వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపించాలని ఆయన లేఖలో కోరారు.
రాష్ట్రంలోని కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైంది. తిరుపతి, తిరుమల, నెల్లూరు, మదనపల్లె, రాజంపేటలో భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగాయి. మొత్తం 196 మండలాలకు భారీ నష్టం వాటిల్లింది. తక్షణ సాయంగా రాష్ట్రానికి వెయ్యికోట్ల రూపాయలు మంజూరు చేయాలని లేఖల్లో కోరారు.