గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌తో సిఎం జ‌గ‌న్ భేటీ..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ను సిఎం వైఎస్‌జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌లిశారు. అమ‌రావ‌తిలో రూ. 40 కోట్ల వ్య‌యంతో 25 ఎక‌రాల్లో టిటిడి నిర్మించిన ఆల‌య ప్రాణ ప్ర‌తిష్ట‌కు రావాల్సిందిగా గ‌వ‌ర్న‌ర్‌ను సిఎం ఆహ్వానించారు. అనంత‌రం రాష్ట్రంలో నెల‌కొన్న తాజా రాజ‌కీయ అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరును వ్య‌తిరేకిస్తూ మే 24వ తేదీన జ‌రిగిన ఆందోళ‌న‌ల‌పై గ‌వ‌ర్న‌ర్‌కు సిఎం జ‌గ‌న్ వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. కోన‌సీమ ఘ‌ట‌న‌ల‌పై కాంగ్రెస్ స‌హా ప‌లువురు ప‌ర‌జా సంఘాల నేతలు గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. కోన‌సీమకు అంబేడ్క‌ర్ పేరు కొన‌సాగించాలా లేదా అనే అంశంపైనా స‌మాలోచ‌ల‌న‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.