రాష్రానికి ప్రత్యేక సాయం వర్తింపజేయండి: సిఎం జగన్
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/jagan-met-union-minister-nirmala-seetharaman.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం వర్తింపజేయాలని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను సిఎం జగన్ కోరారు. సిఎం మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం కేంద్ర ఆర్ధిక మంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని, పాఠశాలల్లో నాడు-నేడు పథకం ద్వారా విద్య , ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వం చేసిన ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (మూలధన పెట్టుబడి)గా భావించి ప్రత్యే సాయం వర్తింప జేయాలని కేంద్ర మంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల 2014-15నాటి రెవెన్యూ లో మొత్తం రూ. 10,460 కోట్లు ఒకే విడత గ్రాంట్ రూపంలో విడుదల చేసినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ డిస్కంలకు ఎపి జెన్కో సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించిన రూ. 6,756.92 కోట్ల బాకాయిల అంశాన్నీ సమావేశంలో ప్రస్తావనకు తెచ్చారు. ఎపి జెన్కో ఇప్పటికే తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో .. నిధులు ఇప్పుడు చాలా అవసరమని, వీలైంన త్వరగా వచ్చేలా చేయాలని కోరారు.