పిఆర్సీపై ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పిన సిఎం జగన్

తిరుపతి (CLiC2NEWS): పీఆర్సీపై ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటనచేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రిని తిరుపతి సరస్వతీ నగర్లో ఉద్యోగుల తరఫున కొందరు ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారు పీఆర్సీపై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ముఖ్యమంత్రి.. పిఆర్సీ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. మరో 10 రోజుల్లో ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు .